స్కూల్​లో మత బోధనలా.... ఆ టీచర్లపై చర్యలు తీసుకోండి

స్కూల్​లో మత బోధనలా.... ఆ టీచర్లపై చర్యలు తీసుకోండి
  • ఎన్టీఆర్ స్కూల్​ వద్ద హిందూ సంఘాల నిరసన 

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్​లోని ఎన్టీఆర్ స్కూల్​వద్ద హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్​తో సహా ముగ్గురు టీచర్లు మత బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకుని పాఠశాలకు రావొద్దని విద్యార్థులను హెచ్చరించారని మండిపడ్డారు. ఈ మేరకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వీహెచ్ పీ, బజరంగ్​దళ్, బీజేపీ, ఏబీవీపీ సభ్యులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.  ప్రిన్సిపల్ సహా ఆ ముగ్గురు టీచర్లపై చర్యలు తీసుకోవాలని స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎం.వీ రామారావుకు వినతిపత్రం అందజేశారు.