
సంగారెడ్డి, వెలుగు: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కందిలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39)కు శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు గుండెపోటు వచ్చింది. వెంటనే జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గేటు ముందే కుప్ప కూలిపడిపోయాడు.
డాక్టర్లు వచ్చి అతడిని పరిశీలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కంది జైలు అధికారులు వెంకట్మృతిని అధికారికంగా ప్రకటించారు. మెదక్జిల్లా నర్సాపూర్టౌన్ కు చెందిన వెంకట్ గంజాయి కేసులో పట్టుబడి ఈనెల 3న కంది జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చాడు.