పాదాలు .. అరికాళ్లు శరీర బరువుని మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు చాలామంది. చూసీచూడనట్టు వదిలేస్తారు. అందుకే రకరకాల కారణాల వల్ల పాదాల మంటల సమస్య ఎదుర్కొంటారు. చాలామంది. .దీనిని వైద్యపరంగా న్యూరోపతి లేదా పారేస్తేసియా అంటారు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి? దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ..
నరాలు దెబ్బతినడం. .దాంతో నరాల మీద ఉండే పొరలు మీద ఒత్తిడి పెరిగి మంట పుడుతుంది. దెబ్బతిన్న నరాలకు గాయాలు లేకపోయినా మెదడుకి నొప్పి అనే సంకేతాలు అందిస్తుంది. ఫలితంగా మంట, నొప్పి వంటివి బాధపెడతాయి. ఇది లోపిస్తే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీని లోపంవల్లే చాలామంది పాదాల మంటల సమస్యలని ఎదుర్కొంటున్నారు
కారణాలెన్నో
- కొన్ని రకాల సమస్యల్లో ముఖ్యంగా మధుమేహంతో బాధ పడే వారికి తగినంత స్థాయిలో హార్మో న్ లు తగినంత ఉత్పత్తి కాకపోవడం (హైపోథైరాయిడిజమ్). దీర్ఘకాల కిడ్నీ జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల నరాలు దెబ్బతిని పాదాల మంటలు వస్తాయి. కొందరికి మానసిక సమస్యల వల్లా అరికాళ్ల మంటలు రావొచ్చు. ఆడవారిలో నెలసరి నిలిచిపోయినప్పుడు అంటే మెనోపాజ్ దశలో ఈ సమస్య వస్తుంది. కొందరికి ఎలాంటి కారణం లేకుండానే పాదాల మంటలు వేధిస్తాయి. దీన్ని ఇడియోపథిక్ అంటారు.
- అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరిగి పాదాల మంటలు వస్తాయి. వయసు పైబడుతున్న కొద్దీ నరాలు బలహీన పడటం వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. కీమోథెరపీ, మద్యపానం, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, రక్తహీనత, కొన్ని ఇతర కారణాల వల్ల కూడా అరికాళ్లలో మంటలు వస్తాయి. నరాల జబ్బులు ఉన్నవాళ్లకు ఈ సమస్యలు అధికం.
- బిగుతుగా ఉన్న చెప్పులు, షూలు వేసుకోవడం వల్ల పాదాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఫలితంగా అరికాళ్ల మంటలు వస్తాయి. పాదాల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల అరికాలి చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
- మధుమేహానికి వాడే మెటాఫార్మిన్ మందులో శరీరం విటమిన్ బి12ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది. అతిగా మద్యం తాగడం వల్ల కొందరికి బి12 లోపం తలెట్టొచ్చు. అలాగే బి5, బి6, బి1 లోపంతో అరికాళ్ల మంటలు వస్తాయి.
- సాధారణంగా శాకాహారుల్లో బి12 లోపం ఎక్కువ. అలాగే కొన్ని రకాల మందులతోనూ బి12 తగ్గొచ్చు.
- మన దేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విటమిన్-బి12 లోపం గురించి. నరాల చుట్టూ రక్షణగా నిలిచే పొర ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-బి12 అవసరం
- బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల బి1 తగ్గిపోయి సమస్యలను అందువల్ల పాదాల మంటలకు కారణమేంటన్నది గుర్తించడం చాలా కీలకం. మధుమేహం ఉందా? ఇంకా సమస్యలేమైనా ఉన్నాయా? అనేది పరీక్షించాలి. అలాంటి సమస్యలేమైనా ఉంటే వాటికి చికిత్స తీసుకుంటే పాదాల మంటలు తగ్గుతాయి. నరాలు దెబ్బతిన్నాయా? లేదా? తెలుసుకోవాలంటే నర్వ్ కండక్షన్ స్టడీ చేయాలి. అరుదుగా నరాల్లోంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేయాల్సి రావొచ్చు. అందుకే నిపుణులైనవైద్యున్ని సంప్రదించి తగిన వైద్యంతీసుకోవాలి.
నివారణ
- అరికాళ్ల మంటలను పూర్తిగా నివారించడం ఆయా వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు
- పాదాలకు .. అరికాళ్లకు గాలి తగలనివ్వాలి
- రోజులో ఎక్కువసేపు పాదాలకు చెప్పులు, సాక్స్ వేసుకోవడం వల్ల గాలి తగలదు. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో కూర్చున్నా, ఇంట్లో ఉన్న కాసేపు చెప్పుల్ని విడిచి నడవడం వల్ల కాలి కండరాలకు గాలి తగులుతుంది. అరికాళ్ల మంటలు, నొప్పులు ఉన్నవాళ్లకి ఇది చక్కని వ్యాయామం. అయితే అలర్జీ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా పాటించడం తప్పనిసరి.
- సరైన వ్యాయామం వల్ల కూడా పాదాల మంటలు తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరిగి పాదాల మంటలు తగ్గుతాయి.
ఇలా చేయండి
- ప్రతిరోజు అల్లం రసం, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె కలిపి పదినిమిషాలు పాదాలను, కాళ్లను మర్దన చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. రక్త ప్రసరణ చురుగ్గా జరిగి ఉపశమనం కలుగుతుంది.
- గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచితే పావుగంటలో అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.