గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ తెలిపింది. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయని తెలిపింది.

ప్రీమియం సర్వీసులను కూడా తనంత తానుగా సబ్ స్క్రైబ్ చేసుకోగలవని తెలిపింది. అంతేకాదు జోకర్  ను గుర్తించడం గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ వ్యవస్థలకు కూడా సాధ్యం కాదని చెప్పింది. వినియోగదారులు వారి మొబైల్స్ చెక్ చేసుకుని..ఒక వేళ ఈ యాప్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సూచించినట్లు సమాచారం.

  • గూగుల్ తొలగించిన 11 యాప్ లు…

..com.imagecompress.android

..com.contact.withme.texts

..com.hmvoice.friendsms

..com.relax.relaxation.androidsms

..com.cheery.message.sendsms

..com.cheery.message.sendsms

..com.peason.lovinglovemessage

..com.file.recovefiles

..com.LPlocker.lockapps

..com.remindme.alr

..com.training.memorygame