బషీర్ బాగ్, వెలుగు: ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీస్టేడియం పరిసరాల్లోని అబిడ్స్ నుంచి బషీర్ బాగ్ వరకు ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన షాపులను సోమవారం ఉదయం కూల్చివేశారు. చాయ్, జ్యూస్, టిఫిన్ బండ్లను తొలగించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వాదానికి దిగారు.
పొట్టకూటి కోసం చిన్న షాపులు పెట్టుకున్న తమపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. కూల్చివేతను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అబిడ్స్ జీహెచ్ఎంసీ ఆఫీస్‌ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా డబ్బాలు ఎలా ధ్వంసం చేస్తారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాశ్ప్రశ్నించారు. చిరువ్యాపారుల పొట్ట కొట్టడం కరెక్ట్‌కాదన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి, బీజేపీ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది.