- స్థానికుల ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా
సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్డిఫెన్స్కాలనీ పార్కు స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. డిఫెన్స్ కాలనీ సర్వే నంబరు 218/1లోని పార్కు స్థలాన్ని ఆక్రమించి పలువురు షెడ్లు నిర్మించారని డిఫెన్స్కాలనీ రెసిడెన్సియల్సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ఏవీ రంగనాథ్విచారణకు ఆదేశించారు.
పార్కు స్థలంలో మూడు షెడ్లు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు బుధవారం భారీ బందోబస్తు నడుమ వాటిని తొలగించారు. అయితే స్థలంలో డిఫెన్స్కాలనీ హౌసింగ్సొసైటీకి చెందినదని సొసైటీ సభ్యుడు శివయ్య చెప్పారు. డెవలప్మెంట్కోసం లీజుకు ఇచ్చామని, ఇక్కడ ఎలాంటి పార్కు లేదన్నారు.