సికింద్రాబాద్ లో ఫుట్​పాత్ ​ఆక్రమణల తొలగింపు

సికింద్రాబాద్, వెలుగు :  సికింద్రాబాద్​లోని ఫుట్​పాత్ ఆక్రమణలను గురువారం పోలీసులు తొలగించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్​ డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. పాదచారులకు దారి లేకుండా ఏర్పాటు చేసిన షెడ్లు, బండ్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. మోండా మార్కెట్ నుంచి ఆల్ఫా హోటల్ వరకు ఫుట్​పాత్​లు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. డ్రైవ్ లో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సీఐలు, ఎస్సైలు, బల్దియా సిబ్బంది పాల్గొన్నారు.