- పలువురు సీపీఎం లీడర్ల అరెస్ట్
జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో పట్టాల కోసం కొందరు గుడిసెలు వేస్కొని పోరాటం చేస్తుండగా.. ఆ గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని
సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇండ్లు లేని పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సీపీఎం లీడర్లు పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని పేదలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కోరుట్ల : నర్సింగపూర్ శివారులో పేదల గుడిసెలను అధికారులు తొలగించగా కోరుట్ల లో సీపీఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కొత్త బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్ ప్రాంతంలో మొహరించి సీపీఎం లీడర్లు, కార్యకర్తలు ఆందోళనను అడ్డుకున్నారు. తిరుపతి నాయక్ తో సహా 7 గురిని అదుపులోకి తీసుకొని , జగిత్యాలకు తరలించారు.