న్యూఢిల్లీ: వాట్సప్పే యూపీఐ సేవల కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్టు నేషనల్పేమెంట్స్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
దీనివల్ల వాట్సాప్ తన కస్టమర్లందరికీ యూపీఐ సేవలను అందించడం సాధ్యమవుతుంది. వాట్సాప్ దశల వారీగా మాత్రమే యూజర్ల సంఖ్యను పెంచుకోవాలని ఎన్సీపీఐ గతంలో ఆదేశించింది. ఈ సంఖ్య 10 కోట్లు దాటకూడదని నిర్దేశించింది.