- ఎస్సీ,ఎస్టీ కమిషన్ సీరియస్
- వార్డెన్‌ను తొలగించాలని ఆదేశాలు
- ట్రిపుల్‌ఐటీలో ముగిసిన పర్యటన
నిర్మల్: బాసర ట్రిపుల్‌ఐటీలో 6 వేల మంది బాలికలకు కేవలం నలుగురు మాత్రమే కేర్టేకర్లు ఉండటం ఏంటీ..? వీలైనంత త్వరగా ఫ్యాకల్టీ సమస్యను తీర్చాలని ఎస్టీ,ఎస్టీ కమిషన్బృందం సీరియస్ అయింది. ఈ మేరకు బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ బృందం పర్యటన ముగిసింది. ట్రిపుల్‌ఐటీలో సరైన వసతులు, ఫ్యాకల్టీ, కేర్ టేక ర్ల కొరత ఉందని స్టూడెంట్స్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు కేర్టేకర్లను పెంచాలని ఆదేశించారు.
హాస్టల్చీఫ్వార్డెన్ శ్రీధర్‌పై స్టూడెంట్స్పలు ఆరోపణలు చేశారు. కమిషన్ మీటింగ్‌కు హాజరు కానీ చీఫ్వార్డెన్పై కమిషన్ సీరియస్ అయింది. స్టూడెంట్స్‌తో అసభ్యం గా ప్రవర్తిస్తున్న ఆరోపణల నేపధ్యంలో వార్టెన్ను వెంటనే డ్యూటీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సరిపడా ప్యాకల్టీ లేకపోవటంతో ఇబ్బందుతు పడుతున్నామని స్టూడెంట్స్కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్యాకల్టీ నియామకాలపై కసరత్తు చేస్తుందని, ఈ ప్రక్రియ తొందరలోనే స్టార్ట్అవుతుందని ఇంచార్జి వీసీ వెంకటరమణ కమిషన్ కు తెలిపారు. మెరుగైన సౌకర్యాలను అందించాలని కమిషన్ అదేశించింది. ట్రిపుల్ఐటీ పర్యటన ముగించుకొని కమిషన్బృందం అక్కడి నుంచి నిజామాబాద్ కు బయలుదేరింది.