మాస్క్‌‌ తీసేయండి.. లేకపోతే బయటికి పోండి

మాస్క్‌‌ తీసేయండి.. లేకపోతే బయటికి పోండి
  • టెక్సస్‌‌లోని రెస్టారెంట్‌‌లో దంపతులకు వింత అనుభవం

టెక్సస్‌‌: మాస్కు పెట్టుకొని రెస్టారెంట్‌‌లోకి వచ్చారని ఇద్దరు దంపతులను అక్కడి సిబ్బంది బయటకు పంపించేశారు. ఈ ఘటన అమెరికా టెక్సస్‌‌లోని ఓ రెస్టారెంట్‌‌లో జరిగింది. పోయిన వారం నటాలీ వెస్టర్‌‌‌‌ గెరెరో, ఆమె భర్తతో కలిసి టెక్సస్‌‌లోని రోవెట్‌‌లో ఉన్న హ్యాంగ్‌‌టైమ్‌‌ రెస్టారెంట్‌‌ అండ్‌‌ బార్‌‌‌‌కు వెళ్లారు. వారు మాస్క్‌‌ పెట్టుకొని లోపలికి వెళ్లగా, అక్కడి లేడీ సిబ్బంది వారి ఐడీ కార్డును చెక్‌‌ చేస్తూ.. మాస్క్‌‌లను తీసేయమని అడిగింది. అయితే వారు అలాగే మాస్క్‌‌ పెట్టుకొని లోపలికి వెళ్లారు. దాదాపు అరగంట తర్వాత ఆ జంటకు తెలిసిన ఫ్రెండ్స్‌‌ అక్కడికి వచ్చారు. అందరూ కలిసి డ్రింక్స్‌‌ తాగుతుండగా, వెయిట్రెస్‌‌ వారి దగ్గరికి వచ్చి మాస్కులు తీయాలని, లేకపోతే రెస్టారెంట్‌‌ నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరింది. ఇక్కడ మాస్క్‌‌ పెట్టుకోకూడదని ఆమె వారికి చెప్పింది. ఈ రెస్టారెంట్‌‌లో ‘నో మాస్క్‌‌’రూల్‌‌ అమల్లో ఉందని, మాస్క్‌‌ పెట్టుకొని రెస్టారెంట్‌‌కు రావొద్దని రెస్టారెంట్‌‌ ఓనర్‌‌‌‌ కోరారు. తర్వాత చేసేదేమీ లేక ఆ దంపతులు రెస్టారెంట్‌‌ నుంచి బయటకు వచ్చేశారు.

ఈ ఘటనపై గెరెరో తన ఫేస్‌‌బుక్‌‌ అకౌంట్‌‌లో రాసుకొచ్చారు. ‘‘కరోనా విజృంభిస్తుంటే రెస్టారెంట్‌‌ సిబ్బంది ఇలా మాట్లాడటంతో ఆశ్చర్యపోయాను.4 నెలల క్రితం నాకు బాబు పుట్టాడు. జెనిటిక్‌‌ డిజార్డర్‌‌‌‌తో బాధపడుతున్నాడు. లంగ్స్‌‌, డైజెస్టివ్‌‌ సిస్టమ్‌‌ పాడైపోయాయి. మా నుంచి బాబుకు కరోనా సోకితే హాస్పిటల్‌‌లో జాయిన్‌‌ చేయాలి. అందుకే మాస్కులు పెట్టుకున్నాం”అని ఆమె పేర్కొంది. టెక్సస్‌‌లో మాస్క్‌‌  పెట్టుకోవడాన్ని ఆ రాష్ట్ర సర్కారు బ్యాన్‌‌ చేసింది.