
- నెలరోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితురాలు
భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా భైంసాకు చెందిన ప్రైవేట్డాక్టర్ నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయడంతో, ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలులో వేసిన రాడ్‌ను తొలగించి.. వాచర్‌ను అలాగే వదిలేయడంతో ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసాలోని రాహుల్‌నగర్ కు చెందిన లావణ్య(40) ఏడాది కింద మెట్లు దిగుతూ జారిపడింది. ఆమె ఎడమ కాలు విరగడంతో కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించారు. కొద్దిరోజుల కింద లావణ్య స్థానిక వెంకటేశ్వర హాస్పిటల్ కాలు చెకప్చేయించుకోగా, డాక్టర్ శ్రీకాంత్ పరీక్షించి రాడ్తొలగించాలని చెప్పారు. తర్వాత ఆపరేషన్ చేసి, రాడ్తొలగించారు. అయితే అంతకు ముందు రాడ్తోపాటు వేసిన వాచర్‌ను డాక్టర్ శ్రీకాంత్ కాలులోనే వదిలేశారు.
ఇటీవల రాడ్తొలగించిన భాగంలో వాపు రావడంతోపాటు చీము కారడం మొదలైంది. ఆందోళన చెందిన బాధితురాలు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో టెస్టులు చేయించుకోగా, కాలులో వాచర్ వదిలేయడంతో ఇన్ఫెక్షన్పెరిగిపోయిందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్‌చేసి వాచర్తొలగించారు. ఈ విషయమై డా.శ్రీకాంత్ ను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, లావణ్య భర్త విఠల్ ఆరోపించారు. డా.శ్రీకాంత్ ను ‘వెలుగు’ ప్రతినిధి వివరణ కోరగా.. అవసరం లేకుంటేనే వాచర్‌ను తొలగిస్తామని చెప్పారు. పేషెంట్ కుటుంబ సభ్యులు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.