టైంకి రావాలంటే కుదరదు.. టైం తీసేయండి .. స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్

టైంకి రావాలంటే కుదరదు.. టైం తీసేయండి .. స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు  బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు చాలా జిల్లాల్లో పలు ప్రాంతాలు  నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మరో వారం రోజులు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.  ప్రస్తుతం పరిస్థితుల్లో  డెలివరీ బాయ్స్   ఫుడ్ ఐటమ్స్ , వస్తువులు  సమయానికి  డెలివరీ  చేయాలంటే  చాలా కష్టం.   సమయానికి డెలివరీ చేయకపోతే  కస్టమర్లపై  దాడులు  చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఆన్ లైన్ డెలివరీ, రైడింగ్ సర్వీసులపై  తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) ఆందోళన వక్తం చేసింది.  సమయానికి  డెలివరీ చేయాలనే నిభందనను తీసేయాలని  ఆయా కంపెనీలను డిమాండ్ చేసింది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా  సమయానికి రాలేరని తెలిపింది. 

 జొమాటో, స్విగ్గీ, బ్లింకెట్ , జెప్ట్,బిగ్ బాస్కెట్  వంటి డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు సమయానుకూలంగా డెలివరీ అవసరాలను తొలగించాలని..  వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని కార్మికులకు  సర్‌ఛార్జ్‌లను ప్రవేశపెట్టాలని కోరింది. అలాగే  డెలివరీ కార్మికులకు రెయిన్‌కోట్లు, ఫోన్ కవర్లు ,  పవర్ బ్యాంక్‌లు వంటి అవసరమైన రక్షణ సామగ్రిని ఉచితంగా అందించాలని యూనియన్ పిలుపునిచ్చింది.

 ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హెయిలింగ్ కంపెనీలు వరదల వల్ల వాహనాలు దెబ్బతిన్న డ్రైవర్లకు రిపేర్ల ఖర్చుల కోసం రూ. 1 లక్ష అందించాలని TGPWU డిమాండ్ చేసింది.  ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేయాలని TGPWU తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.