సాయం కోసం ఎదురుచూపులు

సాయం కోసం ఎదురుచూపులు

కూతురికి క్యాన్సర్​ ట్రీట్​​మెంట్​ చేయించాలని వేడుకోలు

లింగాల, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి చెందిన రేణయ్య, లక్ష్మమ్మ భార్యాభర్తలు. కూలి పనులు, బర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద పాప రేణుక(9) స్థానిక స్కూల్​లో నాలుగో తరగతి చదువుతుండగా ఏడాది కింద క్యాన్సర్ ​బారిన పడింది. ఇప్పటికే రూ.3 లక్షలు అప్పుచేసి పాపకు హైదరాబాద్ లో ట్రీట్​మెంట్​చేయించారు. పూర్తిగా తగ్గలేదు. భార్యాభర్తలు ఇద్దరు కూలికి వెళ్తే గానీ కుటుంబం గడవని స్థితిలో ఉన్న రేణయ్య, లక్ష్మమ్మలకు కూతురికి ట్రీట్​మెంట్​చేయించడం భారంగా మారింది. దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకుంటే ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్​63025 71601, అకౌంట్ నంబర్33567989083 లింగాల బ్రాంచ్, ఐఎఫ్​సీ కోడ్: ఎస్​బీఐఎన్ 0006522కు డబ్బు పంపాలని కోరారు.