రెనాల్ట్‌‌‌‌ ఈవీ మెగాన్‌‌ రెడీ!

మెగాన్‌‌ ఈ–టెక్ ఎలక్ట్రిక్‌‌ కారును రెనాల్ట్‌‌ గ్రూప్‌‌ మొదటిసారిగా పబ్లిక్‌‌లోకి తెచ్చింది. ఈ వెహికల్‌‌ను యూరప్‌‌లో ప్రదర్శించింది. హై టెక్నాలజీతో వస్తున్న ఈ వెహికల్‌‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటోమోటివ్‌‌ ఓఎస్‌‌తో వస్తున్న ఈ వెహికల్‌‌లో గూగుల్ అసిస్టెంట్‌‌, గూగుల్ మ్యాప్స్‌‌, గూగుల్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎఫిషియెన్సీలో రాజీ పడకుండా అఫోర్డబుల్‌‌ ధరకు  న్యూ మెగాన్‌‌ ఈ–టెక్‌‌ను తీసుకొచ్చామని రెనాల్ట్ గ్రూప్ సీఈఓ లుకా డె మియో అన్నారు. ఇందులో బ్యాటరీ సన్నగా (110 మీమీ) ఉంటుంది. 40 లేదా 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌‌తో ఈ వెహికల్ అందుబాటులోకి వచ్చింది. ఒకసారి ఛార్జి చేస్తే 300 కిమీ నుంచి 470 కిమీ వరకు వెళుతుంది.