నిస్సాన్లో రెనాల్ట్కు వాటా

నిస్సాన్లో రెనాల్ట్కు వాటా

న్యూఢిల్లీ: నిస్సాన్​తో కలసి ఏర్పాటు చేసిన ఇండియా జాయింట్​ వెంచర్​ ‘రెనాల్ట్ ​నిస్సాన్​ఆటోమోటివ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​’ (ఆర్​ఎన్​ఏఐపీఎల్)లో వాటాను కొంటున్నట్టు ఫ్రెంచ్​ఆటో కంపెనీ రెనాల్ట్​ ప్రకటించింది. మొత్తం వందశాతం వాటాను చేజిక్కించుకోవడానికి మిగతా 51 శాతం వాటాను కొన్నామని తెలిపింది.  

ఆర్థిక వివరాలను మాత్రం ప్రకటించలేదు. ఇందుకోసం రెనాల్ట్​గ్రూప్​, నిస్సాన్​ షేర్​ కొనుగోలు ఒప్పందం 
కుదుర్చుకున్నాయి.