ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ లేకుంటే షాపు సీజ్

ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ లేకుంటే షాపు సీజ్

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రతి షాపునకు లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఉండాలని, లేకపోతే షాపును సీజ్ చేస్తామని కేఎంసీ అధికారులు హెచ్చరించారు. శనివారం నగరంలోని గాంధీ చౌక్, కమర్షియల్ ఏరియాలో బిల్ కలెక్టర్లు రెవెన్యూ ఇన్​స్పెక్టర్ తో కలిసి ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. 

కేఎంసీ ఆఫీస్ లో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్..కేఎంసీ ఆఫీస్లో ఎల్​ఆర్​ఎస్​కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. మార్చి 31 లోపు ఫీజు పే చేసి ప్రొసీడింగ్ పొం దాలని సూచించారు.