త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రాణాంతక క్యాన్స‎ర్‎ మహ్మమారితో ఎంతో మంది చనిపోతున్నారని.. ఇవాళ కూడా ఓ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‎ విద్యానగర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 26) దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయాలతోనే దేశ వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. 

ALSO READ | ఉస్మానియా హాస్పిటల్ రికార్డ్.. డాక్టర్‌కే సర్జరీ : ఫ్రీగా 4 కిడ్నీ, 2 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు

తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నామని, ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే  ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందిస్తామన్నారు. వీలైనంత వరకు పేదలకు వైద్యసాయాన్ని అందుబాటులోకి తెస్తామని.. మా ప్రభుత్వం సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వమన్నారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని.. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.