- మొదటి వంద మందికి ‘రెనోవా సెంచరీ’ ఆఫర్
- రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్రోడ్నం.12లోని రెనోవా సెంచరీ రోబోటిక్ ఆర్థో సర్జరీ డిపార్ట్మెంట్మొదటి వంద రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లను ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఈ దవాఖానలో రోబోటిక్ సర్జరీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ డాక్టర్ ఏబీ సుహాస్ మసిలామణి మాట్లాడుతూ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో రోబోటిక్స్‌ను రెనోవా హాస్పిటల్స్ ప్రవేశపెట్టిందన్నారు. తమను సంప్రదించిన మొదటి వంద మందికి ఫ్రీ స్కీమ్ అనౌన్స్చేశామని, ఆపరేషన్ ఖర్చును హాస్పిటల్భరిస్తుందన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, మహబూబా బాద్ ఎంపీ బలరాం నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి, తెలంగాణ ఐసీడీఎస్ చైర్మన్ విజయ్‌బాబు, రెనోవో హాస్పిటల్స్ సీఈవో, ఎండీ శ్రీధర్పెద్దిరెడ్డి పాల్గొన్నారు.