మిసెస్ ఇంటర్నేషనల్ ఫైనల్స్ కు డాక్టర్ చంద్రిక

నిర్మల్, వెలుగు: నిర్మల్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రికా అవినాష్ మిసెస్ ఇంటర్నేషనల్ ఫైనల్స్ కు ఎంపికయ్యారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన పోటీల్లో 50 మంది పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం నుంచి చంద్రిక ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఈ మేరకు ఆమె మే 28 నుంచి జూన్ 1 వరకు గుర్​గావ్, ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ ఘనతను సాధించిన డాక్టర్ చంద్రికను నిర్మల్ కు చెందిన పలువురు అభినందించారు.