Aparna Vastare Death: ప్రముఖ యాంకర్-నటి కన్నుమూత..మెట్రోలో వినిపించే అనౌన్స్‌మెంట్‌ వాయిస్ తనదే

ప్రముఖ కన్నడ యాంకర్-నటి అపర్ణా వస్తారే (Aparna Vastarey) (51) క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.గత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమెకు గురువారం రాత్రి మరణించగా..ఈ విషయాన్ని అపర్ణ భర్త నాగరాజు వస్తరే సోషల్ మీడియాలో తెలిపారు.

ఆమె భర్త నాగరాజ్ వస్తరే, కన్నడ రచయిత మరియు ఆర్కిటెక్ట్. "అపర్ణకు క్యాన్సర్ నాల్గవ దశలో ఉందని,క్యాన్సర్‌తో పోరాటంలో ఆమె ఓడిపోయిందని చెప్పారు. అపర్ణ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు,ప్రముఖ ఛానళ్ల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.

అపర్ణ DD చందనలో అనేక కార్యక్రమాలకు తన గాత్రాన్ని అందించింది.అలాగే వివిధ భారతిలో జాకీగా పనిచేసింది.ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్‌మెంట్‌కి అపర్ణనే వాయిస్ ఇచ్చారు.2013లో బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో కంటెస్టెంట్ లో ఆమె ఒకరు.2015లో మజా టాకీస్ కామెడీ షోలో అపారన ‘వరలక్ష్మి’గా నటించింది.

అపర్ణ సినిమాల విషయానికి వస్తే..1984లో పుట్టన్న కనగల్ చిత్రం ‘మసనాడ హూవు’లో తన పాత్రతో గుర్తింపు పొందింది. తర్వాత, ఆమె శివరాజ్ కుమార్ ‘ఇన్‌స్పెక్టర్ విక్రమ్’మూవీతో సహా అనేక చిత్రాలలో నటించింది.అంతేకాకుండా అపర్ణ టీవీ సీరియల్స్‌లో కూడా నటించి తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంది. ముదలమనే మరియు ముక్త ఆమె ప్రసిద్ధ సీరియల్స్‌లో నటించింది.

Also Read:ఈ వారం ఓటీటీలో మాస్టర్ పీస్ సినిమాలు, వెబ్ సిరీస్ లివే!