ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్.. బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఐఫా అవార్డును అందుకున్నారు. ‘బేబి’ చిత్రంలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు అనంత శ్రీరామ్‌ను అభినందించారు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని ఎన్‌కేఎన్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఫిలిం ఫేర్, సైమా, గామా లాంటి పలు అవార్డులు వరించాయి. ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతుండటం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే దర్శకనిర్మాతలతో ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది.