అకిరాకు యాక్టింగ్పై ఇంట్రెస్ట్ లేదు.. అవన్నీ రూమర్స్

అకిరాకు యాక్టింగ్పై ఇంట్రెస్ట్ లేదు.. అవన్నీ రూమర్స్

గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్(Pawan kalyan)-రేణుదేశాయ్‌(Renu desai) ల కొడుకు అకిరా నందన్(Akira nandan) ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోను ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్ర రావు(K Raghavendra rao) షేర్ చేశారు. ఆ ఫొటోలో అకిరాతో పాటు కే రాఘవేంద్ర రావు, ఆయన మనవడు ఉన్నారు.  దానికి ఫోర్త్ జనరేషన్ అఫ్ బాయ్స్ అమెరికాలోని ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యారని క్యాప్షన్‌ ఇచ్చారు రాఘవేంద్ర రావు.

ఇంకేముంది అదికాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వారసుడి ఎంట్రీ ఫిక్స్ అయిందని తెగ సంబరపడ్డారు. 

అయితే తాజాగా వారి ఆశలపై నీళ్లు చల్లారు అకిరా తల్లి రేణు దేశాయ్. అకిరా కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదని, సినిమాల్లో నటించాలనే కోరిక కూడా లేదని, అతను ఏ ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అవ్వలేదని క్లారటీ ఇచ్చారు. ఒక వేళ అకిరాకు నిజంగా సినిమాలో నటించాలనే ఆసక్తి కలిగితే  ఆ విషయాన్ని నేను మీకు చెప్తానని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ఈ మేరకు ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.