
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. 21 ఎమ్మెల్యే. 2 ఎంపీ సీట్లు గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు పవన్ కళ్యాణ్. సమావేశం అనంతరం భార్య అనా లెజినోవా, కొడుకు అకిరా నందన్ తో సహా మోదీని ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అయితే.. ఈ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ కన్నా.. అకిరానే ఎక్కువ హైలెట్ అయ్యారు. అది చూసిన మెగా ఫ్యాన్స్ సైతం సంబరాలు చేసుకున్నారు. వారసుడు సిద్ధం అంటూ కామెంట్స్ చేశారు. అయితే.. తన కొడుకు అకిరా నందన్ ప్రధాని మోదీని కలవడంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎమోషనల్ గా స్పందించారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏ పోస్ట్ లో ఆమె అకిరా మోదీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నేను చాలా కాలం నుండి బీజేపీ వ్యక్తిని. ఈరోజు నా కొడుకు అకిరాని ప్రధాని నరేంద్ర మోదీ పక్కన చూడటం అనేది చాలా సంతోషంగా, ఎమోషనల్ గా ఉంది. దీని గురించి నాకు చాలా చెప్పాలని ఉంది కానీ, మాటలు రావడం లేదు. ప్రస్తుతం నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోదీని కలిసిన తరువాత అకిరా నాకు ఫోన్ చేశాడు. ఆయన చాలా స్ట్రాంగ్, పాజిటివ్ పర్సన్ అని చెప్పాడని.. ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.