రాష్ట్రంలో రక్షణ కరువైందని ఆరోపించారు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి. తెలంగాణలో కిడ్నాప్ లు, హత్యలు సర్వ సాధారణం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అందరూ కిడ్నాప్ లు మర్డర్ లు చేస్తారన్నారు.ల్యాండ్ డీలింగ్స్ విషయంలో తెలంగాణ అడ్డాగా మారిందన్నారు.ధరణి పోర్టల్ మొత్తం తప్పులతడకగా ఉందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వేల మంది అన్నదాతలు నష్టపోతున్నారని తెలిపారు.ఎప్పుడో అమ్మినా భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని మండిపడ్డారు. దీంతో రియల్ ఎస్టేట్ మాఫియా రైతుల పై దౌర్జన్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె.టెక్నాలజీ మంచిదే.. కానీ అదే టెక్నాలజీ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని తెలిసినా అదే కంటిన్యూ చేయడం సమంజసం కాదన్నారు.
మరిన్ని వార్తల కోసం
ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు
రేప్ కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్టు