
ఖమ్మం : కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రేణుకాచౌదరి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. SR అండ్ BJNR కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటుతోనే ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు రేణుకా చౌదరి.
అక్కడి పోలింగ్ కేంద్రంలో కొందరు దొంగ ఓట్లు వేస్తున్న యువతీ యువకులను కాంగ్రెస్ నేతలు గుర్తించారు. వారిని పోలింగ్ సెంటర్లోనే నిలబెట్టి ప్రశ్నించారు రేణుకాచౌదరి. పోలింగ్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అధికార పార్టీ నేతలే స్టూడెంట్ల భవిష్యత్తు పాడు చేస్తున్నారని విమర్శించారు రేణుకా చౌదరి. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేసి.. పోలింగ్ సరిగా జరిగేలా చూడాలని ఆమె కోరారు.