మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కోత్లాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ క్యాంపెయిన్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిని స్రవంతిని గెలిపించాలని ఓటర్లను కోరారు. మునుగోడు అభివృద్ధిని ఏ పార్టీలు పట్టించుకోలేదని రేణుక విమర్శించారు.
ముునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుడండంతో పార్టీలన్ని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న జరగనున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు 6న వెలువడనున్నాయి. మొత్తం బరిలో 47 మంది ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.