బారికేడ్లు తోసి... బీఆర్​ఎస్​కు వార్నింగ్ ఇచ్చి..

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు బీఆర్​ఎస్​ అడ్డంకులు సృష్టించడంపైన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సీరియస్​ అయ్యారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని బీఆర్​ఎస్​ సర్కార్​ను ప్రశ్నించారు.  4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

అనంతరం ఖమ్మం రూరల్​మండలం కరుణ గిరి వద్ద వాహనాలు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆగ్రహంతో తన్ని చేతితో పక్కకు తొలగించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి సభను అడ్డుకోలేరని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్​ దోచుకుని దాచుకునే రకమని విమర్శించారు.  కార్యక్రమంలో ముస్తఫా, రామకృష్ణ తదితరులు ఉన్నారు.