న్యూఢిల్లీ: రేణుకాస్వామి (33) హత్య కేసులో నిందితులు దర్శన్ తోగుదీప, పవిత్రా గౌడతో పాటు మరో ఐదుగురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు జవాబు ఇవ్వాలని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్.మహదేవన్ తో కూడిన బెంచ్ ఆ నోటీసుల్లో వారిని ఆదేశించింది.
కాగా.. ఈ కేసులో నిందితులకు కర్నాటక హైకోర్టు గత నెల 13న బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో వారు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది.