ఎడపల్లి మండలంలో మూతబడ్డ అంగన్వాడీ కేంద్రం పున:ప్రారంభం

 ఎడపల్లి మండలంలో మూతబడ్డ అంగన్వాడీ కేంద్రం పున:ప్రారంభం
  • ప్రైవేటు టీచర్‌‌ని నియమిస్తామని వెల్లడి 

ఎడపల్లి , వెలుగు: ఎడపల్లి మండలంలో రెండు నెలలుగా మూతబడ్డ అంగన్ వాడీ కేంద్రం సోమవారం నుంచి తెరుచుకోనుందని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రసూల్ బీ తెలిపారు. స్థానిక అంగన్ వాడీ కేంద్రంలో టీచర్ అంశం తొమ్మిదేళ్లుగా కోర్టులో ఉంది. దీంతో రెండు నెలల కిందట వరకు దాన్ని ఇన్ చార్జి టీచర్లతో నడిపించారు. రెండు నెలలుగా ఇక్కడకు ఇన్ చార్జి టీచర్లు రాకపోవడంతో మూతపడింది.

ఇక్కడ టీచర్ ను నియమించి సమస్య పరిష్కరించాలని పీడీని గ్రామస్థులు కోరారు.  కోర్టు కేసు తేలే వరకు ప్రైవేటు టీచర్ ను నియమిస్తామని పీడీ తెలిపారు. దీనికి ప్రైవేటు టీచర్ కు నెలసరి వేతనం చెల్లించాలని కోరడంతో గ్రామస్థులు అంగీకరించారు. సమావేశంలో ఐసీడీఎస్ బోధన్​ప్రాజెక్టు అధికారిణి జానకి, మండల సూపర్​ వైజర్​విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.