డివిజన్లలో రోడ్ల రిపేర్లు చేపట్టాలి

  • డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: అన్ని డివిజన్లలో అవసరం ఉన్న చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని గ్రేటర్​ డిప్యూటీ మేయర్ ​మోతె  శ్రీలతా శోభన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మట్టి రోడ్డు ఉన్నచోట బీటీ లేదా సీసీ రోడ్లకు అనుమతులు తీసుకొని త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని డివిజన్ల జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం తార్నాకలోని తన క్యాంపు ఆఫీస్​లో​ సమావేశమయ్యారు.  డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

అధికారులు ప్రతి డివిజన్ కార్పొరేటర్లకు సహకారం అందిస్తూ అభివృద్ధిలో  భాగస్వాములు కావాలని కోరారు. మూసీ ప్రక్షాళన ద్వారా సిటీ వాసులకు వరద నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరాజు, డిప్యూటీ ఇంజినీర్ సువర్ణ, అసిస్టెంట్ ఇంజినీర్లు వేణు తదితరులు పాల్గొన్నారు.