ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధంలోకి దిగాయి. రెండు దేశాలు వెనక్కి తగ్గేలా లేదు.. పోటాపోటీగా బాంబులు కురిపించుకుంటున్నాయి.. ఇదే సమయంలో ఇజ్రాయెల్ చేసిన ఓ ప్రకటన.. ప్రపంచ దేశాలను ఆకర్షించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత.. 2006 సంవత్సరం తర్వాత.. ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ గ్రౌండ్ వార్ మొదలుపెట్టింది.. అంటే నేలపై యుద్ధం.. ఫేస్ టూ ఫేస్ యుద్ధం అన్నమాట.. మరి ఇన్నాళ్లు ఇజ్రాయెల్ యుద్ధం ఎలా చేసింది అంటారా.. ఎయిర్ స్ట్రయిక్స్.. విమానాలతో బాంబులు వేయటం.. మిస్సైల్ దాడులతో ధ్వంసం చేయటం.. పేజర్లు, వాకీటాకీలను పేల్చటం వంటి టెక్నాలజీలతో ప్రత్యర్థులను నాశనం చేసేది.. గాజాలోనూ ఇదే తరహా దాడులు, విధ్వంసంతో సర్వనాశనం చేసింది. ఆ తర్వాత గ్రౌండ్ లోకి తన యుద్ధ ట్యాంకులను దించేది. ఇప్పుడు అలా కాదు.. హిజ్బుల్లాపై ఫేస్ టూ ఫేస్ యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యింది.
హిజ్బుల్లాకు గట్టి పట్టు ఉన్న దక్షిణ లెబనాన్ లో భూతల యుద్ధం.. గ్రౌండ్ వార్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇందు కోసం 7 వేల మంది సైనికులను, వందల సంఖ్యలో యుద్ధం ట్యాంకులను దక్షిణ లెబనాన్ వైపు తరలించింది. 2006 నాటి గుణపాఠాల నుంచి మంచి వ్యూహాలు నేర్చుకున్నాం.. ఈసారి మా సైనికులు ఉగ్రవాదులను వెంటాడి.. వేటాడి పట్టుకుని చంపుతారు.. వాళ్ల స్థావరాలను నాశనం చేస్తారు అంటూ ఉద్వేగంగా ప్రకటించారు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జిహలేవి. అత్యంత శక్తివంతమైన, అనుభవం ఉన్న సైన్యం ఎలా ఉంటుందో ఈసారి హిజ్బుల్లాకు చూపిస్తాం.. శత్రువులను ఎలా నాశనం చేయాలో కూడా వాళ్లకు చూపిస్తాం అంటూ ప్రకటించారాయన. ఇజ్రాయెల్ గ్రౌండ్ వార్ తో దక్షిణ లెబనాన్ ఇప్పుడు యుద్ధ భూమిగా మారిపోయింది.
Also Read:-అప్పట్లో ఇజ్రాయెల్.. ఇరాన్ జాన్ జిగిరీలు.. ఇప్పుడు యుద్ధం
2006లో ఏం జరిగింది అంటే..?
2006లో దక్షిణ లెబనాన్ లో,, హిజ్బుల్లా ఉగ్రవాదులపై భూతల యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్. ఆ యుద్ధంలో కేవలం 30 రోజుల్లోనే ముగిసింది. ఇజ్రాయెల్ ఓడిపోయింది. 121 మంది సైనికులు చనిపోయారు. 20కిపైగా యుద్ధ ట్యాంకులు నాశనం అయ్యాయి. దక్షిణ లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదుల వ్యూహాలకు ఇజ్రాయెల్ సైన్యం తోక ముడిచింది. భూతల యుద్ధం.. గ్రౌండ్ వార్ వల్ల తీవ్రంగా నష్టపోయింది ఇజ్రాయెల్. అప్పట్లో 20 యుద్ధ ట్యాంకులు, 121 మంది సైనికులు మాత్రమే చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించినా.. ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. హిజ్బుల్లా సైన్యం గెరిల్లా దాడులతో యుద్ధ ట్యాంకులను పేల్చేయటం.. మెరుపు దాడులతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేసింది.
2006 ఓటమి అనుభవం తర్వాత.. ఇప్పటి వరకు మళ్లీ గ్రౌండ్ వార్ చేయలేదు ఇజ్రాయెల్. గాజాపై దాడి కూడా 90 శాతం ఎయిర్ స్ట్రయిక్స్.. మిస్సైల్ దాడులు, విమానాలతో బాంబులు వేయటం ద్వారానే ధ్వంసం చేసింది. కేవలం 10 శాతం మాత్రం గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ వార్ చేసింది.
మళ్లీ ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ పై గ్రౌండ్ వార్ కు దిగటం మరింత ఆసక్తి రేపుతోంది. ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదో చూడాలి..