షోకాజ్ నోటీసుకు 2 రోజుల క్రితమే రిప్లై ఇచ్చా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: కాగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.  షోకాజ్ నోటీసుకి తాను రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానని తెలిపారు.  తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని స్పష్టం చేశారు. తారిక్  ఆన్వర్ ఆందుబాటులో లేరని తెలిపారు.

రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో రాష్ట్రంలో ఉండకుండా విదేశాలకు వెళ్లారన్న విమర్శలకు కోమటిరెడ్డి బదులిచ్చారు. షోకాజ్ నోటీసు వచ్చినప్పుడు పాదయాత్రలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. తనకు క్లీన్ చిట్ వచ్చాక భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.