పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌

పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌

ఓట్ల లెక్కింపుకు ఒక్కరోజు అంటే జూన్ 03వ తేదీ సోమవారం రోజున  పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. బారాసాత్, మథురాపుర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ బూత్‌లు ఉన్నాయి. జూన్ 3  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు బూత్‌ల్లోనూ ఏడో దశలో భాగంగా ఈ నెల 1న పోలింగ్‌ జరిగింది. ఇదిలా ఉండగా, డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానంలోని పలు బూత్‌లలో రీపోలింగ్ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈసీకి లేఖ రాసింది. 

కాగా శనివారం బెంగాల్‌లో ఆఖరి దశ పోలింగ్‌ జరగ్గా చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది లోక్‌సభ స్థానాలకు శనివారం జరిగిన చివరి దశ పోలింగ్‌లో 73.79 శాతం ఓటింగ్ నమోదైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 22 నుంచి -26 సీట్లు,  టీఎంసీ 14-నుంచి 18 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి.