Test Cricket: టెస్టులకు పునరుజ్జీవం.. రూ. 125 కోట్ల ప్రత్యేక నిధి!

Test Cricket: టెస్టులకు పునరుజ్జీవం.. రూ. 125 కోట్ల ప్రత్యేక నిధి!

సిడ్నీ: టీ20 క్రికెట్ హవాలో కళ తప్పుతున్న టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ను కాపాడేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరీదైన నిర్ణయం తీసుకోనుంది. 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్ల) ఫండ్‌‌‌‌‌‌‌‌తో టెస్టులకు జీవం పోయాలని భావిస్తోంది. ఈ మొత్తంతో టెస్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులు పెంచి.. ప్రతిభావంతులు టీ20 ఫ్రాంచైజీ లీగ్‌‌‌‌‌‌‌‌లకు వలస వెళ్లకుండా చేయాలని చూస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేసిన ఈ ప్రతిపాదనకు బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మద్దతు తెలిపినట్టు ఓ కథనం వెలువడింది. 

ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌ ద్వారా టెస్టు ప్లేయర్ల కనీసం మ్యాచ్ ఫీజు పెంచడంతో పాటు ఆయా జట్ల ఫారిన్ టూర్ల ఖర్చును ఐసీసీ భరించనుంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు టీ20 లీగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇస్తున్న భారీ మ్యాచ్ ఫీజులతో పోటీ పడలేక ఇబ్బంది పడుతున్న వెస్టిండీస్ వంటి  నేషనల్ బోర్డులకు సపోర్ట్ లభించనుంది. టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడే ఒక్కో ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనీసం 10 వేల డాలర్లు (రూ. 8.4 లక్షలు) అందించడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలు దేశాల క్రికెట్‌‌‌‌‌‌‌‌ జట్ల ఫారిన్ టూర్స్‌‌‌‌‌‌‌‌ ఖర్చులను ‘టెస్టు ఫండ్‌‌‌‌‌‌‌‌’ నుంచి అందిస్తారని సమాచారం.  అయితే, తమ ఆటగాళ్లకు ఇప్పటికే భారీ మొత్తంలో జీతాలు ఇస్తున్నందున ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ధనిక క్రికెట్ దేశాలకు ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌తో  ఉపయోగం లభించకపోవచ్చు.