అఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ!

అఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో ఆప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది ముందుగా అనుకున్న సిరీస్ కాదు. ఐసీసీ ప్రకటించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)లో కూడా ఇది లేదు. అయినప్పటికీ అఫ్గాన్ బోర్డు కోరిక మేరకు బీసీసీఐ అందుకు అంగీకారం తెలిపింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

No విరాట్ కోహ్లీ vs నవీన్ ఉల్ హక్

ఒకవేళ అఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఖరారు అయినా, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీలకు విశ్రాంతినివ్వాలని బోర్డు భావిస్తున్నట్లు పీటీఐ తన రిపోర్టులో పేర్కొంది. అదే జరిగితే విరాట్ కోహ్లి వర్సెస్ నవీన్ ఉల్ హక్ చూసే అవకాశం అభిమానులకు కలిగేలా లేదు. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు అప్పజెప్పే అవకాశం ఉంది. 

యశస్వీ జైశ్వాల్‌ ఎంట్రీ.. 

ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించనున్నట్లు పీటీఐ స్పష్టం చేసింది. అయితే ఈ సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై త్వరలోనే ప్రకటన రానుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ చూసేందుకు ఏసీబీ అధ్యక్షుడు మిర్వైస్ అష్రఫ్ అహ్మదాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా అఫ్ఘాన్-ఇండియా సిరీస్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.