
హనుమకొండసిటీ, వెలుగు : ‘వెలుగు’ రిపోర్టర్ మాడుగుల రాజ్‌కుమార్ బహుజన సాహిత్య అకాడమి సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన లెటర్‌ను బీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం. గౌతమ్, కార్యదర్శి కనుకుంట్ల విజయ్‌కుమార్, అవార్డ్ సెలెక్షన్ కమిటీ మెంబర్ ముక్కెల సంపత్‌కుమార్ బుధవారం అందజేశారు.
త్వరలో ఢిల్లీలో జరగనున్న ప్రోగ్రామ్‌లో అవార్డును అందజేయనున్నారు. రాజ్‌కుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుతరాలకు అందించేందుకు చేస్తున్న కృషితో పాటు సుమారు దశాబ్దంన్నర కాలంగా జర్నలిజంలో అందిస్తున్న సేవలకు నేషనల్ అవార్డు దక్కింది.