అనారోగ్యంతో వెలుగు రిపోర్టర్​ మృతి

అనారోగ్యంతో  వెలుగు రిపోర్టర్​ మృతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అనారోగ్యంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెలుగు రిపోర్టర్​ సంతోష్(28)​ మంగళవారం చనిపోయాడు. కొంత కాలంగా పేగు సంబంధిత వ్యాధితో  బాధపడుతున్న అతను ఏడాదిగా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాడు.

సంతోష్​కు ఇద్దరు అక్కలు, అమ్మ ఉన్నారు. కొడుకు మరణంతో 70 ఏండ్ల వయసున్న తల్లి కన్నీరుమున్నీరవుతోంది. సంతోష్​ మృతి పట్ల చర్ల జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.