రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ 21వ ఎడిషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్– 2023 నివేదికను విడుదల చేసింది.
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్– 2023 లో 180 దేశాలకుగాను భారత్ 161వ స్థానంలో నిలిచింది. జర్నలిస్టుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ తన తాజా నివేదికలో పేర్కొంది.
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2023లో నార్డిక్ దేశాలైన నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్ తొలి మూడు స్థానాల్లో నిలవగా వియత్నాం, చైనా, ఉత్తరకొరియా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ అనే గ్లోబల్ మీడియా వాచ్డాగ్ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచీని ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఉంది. దీనికి ఐక్యరాజ్య సమితి కన్సల్టేవ్ హోదా ఉంది.