ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని.. అతను ఐపీల్ లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతాడని తెలియజేస్తుంది. ఇంకా అధికారికంగా ఖారారు కాకపోయినా.. పంత్ ఐపీఎల్ లో ఆడటం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు సమాచారం.
రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్ నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన రికవరీ ప్రక్రియ గురించి అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఇటీవలే పంత్ NCAలో నడుస్తున్న ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని త్వరలోనే క్రికెట్ లోకి అడుగుపెడతాడని సంకేతం ఇచ్చాడు. గత సీజన్ లోయాక్సిడెంట్ కారణంగా పంత్ దూరమవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఘోర ప్రదర్శన చేసింది. వార్నర్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 5 మ్యాచ్ ల్లో నిలిచి 9 వ స్థానంలో నిలిచింది.
పంత్ ఐపీఎల్ 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో 64 క్యాచ్‌లు, ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు ఉన్నాయి.
Rishabh Pant is set to return in IPL 2024 as pure Batter & Captain. [Cricbuzz] pic.twitter.com/6knpn1WV2R
— Johns. (@CricCrazyJohns) February 20, 2024