ఐపీఎల్ టోర్నీ ముగిసిన 5 రోజులకే టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మే 26న ఐపీఎల్ ఫైనల్ పోరు జరగనుండగా.. జూన్ 1న మెగా ఈవెంట్ తెరలేవనుంది. అందుకు మరెంతో సమయం లేదు. సరిగ్గా 50 రోజుల గడువు మాత్రమే మిగిలివుంది. పైగా మెగా టోర్నీలో పాల్గొనే ఆయా జట్లు.. తమ ఆటగాళ్ల వివరాలను అందించడానికి మే1 డెడ్‌లైన్. ఈ క్రమంలో ఏప్రిల్ 28న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబైలో సమావేశం కానున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ భేటీలో వీరిద్దరూ వరల్డ్ కప్ జట్టులో భాగమయ్యే ఆటగాళ్లను ఖారారు చేయనున్నట్లు సమాచారం.
Also Read: కోహ్లీ ఇచ్చిన బ్యాట్ విరగ్గొట్టిన భారత యువ క్రికెటర్
పంత్ పక్కా.. గిల్, జైస్వాల్‌లో ఒకరికే ఛాన్స్
టీ20ప్రపంచ కప్ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. మొదట హార్దిక్ పాండ్యా అనుకున్నప్పటికీ.. బీసీసీఐ పెద్దలు హిట్ మ్యాన్‌కు మరో అవకాశమిచ్చారు. వరల్డ్ కప్ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్లు.. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ప్రధాన పేసర్లు.. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు స్థానాలపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. యువ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కవచ్చని సమాచారం.
జితేష్ శర్మ స్థానంలో సంజూ శాంసన్
ఐపీఎల్ టోర్నీ ముందువరకూ . వికెట్ కీపర్ రేసులో అగ్ర స్ధానంలో ఉన్న జితేష్ శర్మ క్యాష్ రిచ్ లీగ్ లో పెద్దగా రాణించడం లేదు. వరుసగా విఫలమవుతున్నాడు. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన 7 మ్యాచ్ ల్లో 55.20 సగటుతో 276 పరుగులు చేశాడు. దీంతో పంత్ కు తోడుగా శాంసన్ ను ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. అలాగే, యువ పేసర్లు మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, వైభవ్ అరోరా,ఖలీల్ అహ్మద్ నలుగురిలో ఒకరికి చోటు దక్కచ్చని కథనాలు వస్తున్నాయి.
Here's our India's squad for the T20 World Cup 2024 🇮🇳🔵
— InsideSport (@InsideSportIND) April 20, 2024
Would you like to see any changes? 🤔#RohitSharma #ViratKohli #T20WorldCup #T20WorldCup2024 #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/RAWr2ufkjF