భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత వీడడం లేదు. అతను కోలుకోలేదంటూ రోజుకో అప్‌డేట్ వస్తోంది. అందుకు ప్రధాన కారణం.. టీ20 వరల్డ్ కప్. వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌కు ఆరు నెలల గడవు మాత్రమే ఉంది. ఆ టోర్నీలో పాండ్యానే జట్టును నడిపిస్తాడని ముందుగా భావించారు. కానీ అతడు ఇప్పుడు ఏకంగా జట్టుకు దూరమవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
దక్షిణాఫ్రికా పర్యటన ముగిశాక భారత జట్టు స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయానికి పాండ్యా కోలుకుంటాడా! అనే దానిపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ సిరీస్‌కు అతడు దూరమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఐపీఎల్ నాటికి అతడు కోలకుంటాడని, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడు కోలుకోకపోతే మరి పొట్టి ప్రపంచ కప్ సంగతేంటి..? అనే ప్రశ్నపై నోరు మెదపడం లేదు. సమాధానాలు దాట వేస్తున్నాయి.
Hardik Pandya ruled out of the Afghanistan T20I series.
— Johns. (@CricCrazyJohns) December 27, 2023
- He will be fit for IPL 2024....!!!! pic.twitter.com/iTzN7U74nV
శాపం..!
పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ సన్నద్ధత కోసం హార్దిక్ గాయాన్ని సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నాడని కొందరు నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. మరికొందరైతే రోహిత్ నుంచి కెప్టెన్సీ లాక్కున్న శాపం తగిలిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Scenes right now.#HardikPandya #MumbaiIndians pic.twitter.com/26lRHsxKBd
— Rajabets ??? (@smileagainraja) December 23, 2023
ఎప్పుడు గాయపడ్డాడంటే..?
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అప్పటి నుంచి పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.