బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సేవలైన ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు నివేదికలు వస్తున్నాయి. రిజర్వేషన్ విధానాలపై కొనసాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ ఐస్ న్యూస్ శుక్రవారం తన అధికారిక X ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2 నుంచి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఇంటర్నెట్‌ను పరిమితం చేసిందని వెల్లడించింది. మరోవైపు, మొబైల్ కనెక్షన్‌లలో ఫేస్‌బుక్ మరియు రష్యన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కి కూడా యాక్సెస్ బ్లాక్ చేయబడిందని మరికొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
120 మిలియన్ల మొబైల్ వినియోగదారులు
బంగ్లాదేశ్‌లో 120 మిలియన్లకు పైగా మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు ఉండగా.. వీరిలో 70 శాతం మంది సోషల్ నెట్‌వర్కింగ్ సేవలను వాడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బంగ్లా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
BREAKING:
— Globe Eye News (@GlobeEyeNews) August 2, 2024
Bangladesh bans Instagram, TikTok, WhatsApp, and YouTube in the country. pic.twitter.com/v2T47KR42L