దేవుడయ్యా మన రింకూ సింగ్: ఆలయ నిర్మాణానికి 11 లక్షల విరాళం

దేవుడయ్యా మన రింకూ సింగ్: ఆలయ నిర్మాణానికి 11 లక్షల విరాళం

అవసరానికి మించి డబ్బు సంపాదిస్తే సరిపోదు.. ఆపదలో ఉన్న వారికి తోచినంత సాయం చేసే మంచి మనసు కూడా ఉండాలి. అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదు. అందులో మన రింకూ సింగ్ ఒకరు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూకు కష్టాల్లో ఉన్నవారు కనపడితే చాలు.. నేనున్నానంటూ ధైర్యం చెప్తున్నాడు. క్రికెట్‌లో తనలాగా రాణించాలని ఉవ్విళ్లూరుతోన్న పేద పిల్లలకు తన వంతు చేయూతను అందిస్తున్నాడు. అలాగే, తన స్వస్థలమైన అలీఘర్‌లో నిరుపేద పిల్లల కోసం ఒక హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు.

ఇదిలావుంటే, రింకూ సింగ్ ఇటీవల ఒక ఆలయ నిర్మాణం కోసం 11 లక్షల రూపాయల విరాళం  ఇచ్చాడు. గురువారం త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విరాళం అంద‌జేశాడు. ఆలయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని కమల్‌పూర్‌లో నిర్మిస్తున్నారు. అత‌డిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. రింకూ సింగ్ మంచి మ‌న‌సుకు ఇదొక నిద‌ర్శ‌న‌మిద‌ని పొగుడ్తున్నారు.

 స్వీపర్ To క్రికెటర్: వాట్ ఏ జర్నీ రింకూ
 
రింకూ సింగ్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌. తండ్రి ఖన్‌చంద్ర సింగ్ ఎల్‌పీజీ గ్యాస్‌ను ఇళ్లకు డెలివరీ చేస్తూ ఉండేవారు. ఖన్‌చంద్ర సింగ్ కు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. మూడోవాడు రింకూ. గ్యాస్ కంపెనీ ఇచ్చిన రెండు గదలు క్వార్టర్ లోనే అతని బాల్యం గడిచింది. అతని పెద్దన్నయ్య సోనూ ఆటోడ్రైవర్ కాగా.. మరో అన్న ముకుల్ కోచింగ్ సెంటర్లో ఫ్లోర్ శుభ్రం చేసేవాడు. ఇంత పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. అయినా సరే తోచినంత సాయం చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

ALSO READ: Cricket World Cup 2023: పాకిస్తాన్‌పై ఎలాగూ రాణిస్తా.. ముందు మా అమ్మను కలవాలి: బుమ్రా