ధోని.. ధోని.. ఈ మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై రెండేళ్లు గడిచినా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అతడు బయట కనిపించినా వార్తే.. కారులో తిరిగినా వార్తే. అందుకు అతను సాధించిన విజయాలే కారణం. దేశానికి ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు(2011 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. అతని కెప్టెన్సీ రోజులు.. భారత క్రికెట్ లో స్వర్ణయుగం అంటే నమ్మండి. అలాంటి గొప్ప ఆటగాడు ఇప్పుడు అడ్రెస్ కనుక్కోలేక నానా తిప్పులు పడ్డాడు.
అడ్రస్ కోసం నానా పాట్లు
ధోని రోడ్డుపై కారు ఆపి అక్కడున్న కొందరిని ఓ అడ్రస్ అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ధోని అడుగుతోంది అడ్రెస్‌హే కదా! అందులో ఏముంది అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. అతనడిగిన అడ్రెస్ మరెవరిదో కాదు.. అతని సొంతూరుదే. అవును..ధోనీ ప్రస్తుతం తన స్వంత ఊరు రాంచీలో టైంపాస్ చేస్తున్నాడు.
తాజాగా అతను తన మిత్రుడితో కలిసి కారులో ఓ టూర్ వెళ్లాడు. అయితే అక్కడినుండి తిరగొచ్చే సమయంలో దారి తప్పాడు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల నుంచి అతను నావిగేషన్ హెల్ప్ తీసుకున్నాడు. ఓ రూట్లో చిక్కుకున్న అతను.. రాంచీ ఎటువైపు వెళ్లాలని అడగగా.. వారు అతనికి దారి చెప్పారు. ముందు ఓ సర్కిల్ వస్తుందని, అక్కడ నుంచి వెళ్తే రాంచీకి చేరుకుంటారని ఓ అభిమాని చెప్పాడు. ఆ విగ్రహం ఉన్న సర్కిల్ వద్ద రౌండ్ తీసుకోవాలా అని ధోనీ ఆ అభిమానిని అడిగాడు. ధోనీ ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తుండగా, అతను మాత్రం ముందు సీటులో కూర్చుకున్నాడు.
Asking directions from Random strangers >> Google maps
— BALA (@rightarmleftist) August 11, 2023
MS Dhoni is literally us
Also he’s listening to Deva Deva ? pic.twitter.com/PHK3Df5Fre
ఏదేమైనా ధోని రోడ్డుపై ఉన్న వారిని అడ్రెస్ చూసి.. టెక్నాలజీ వాడుకోవచ్చు కదయ్యా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ధోని గూగుల్ మ్యాప్స్‌ని నమ్మడని అందుకే అలా అడుగుతున్నారని వాపోతున్నారు.