జనవరి 11 నుండి భారత్ - అఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు జట్లను ప్రకటించగా.. మరో 24 గంటల్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సమయంలో కీలక వార్త అందుతోంది. వ్యక్తిగత కారణాల రీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడని సమాచారం.
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని.. బీసీసీఐ పలు మార్పుతో జట్టును ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి జూనియర్లను తప్పించి సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు జట్టులో చోటు కల్పించింది. అలాంటిది కోహ్లీ తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరమవ్వడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుటుంబంతో మరింత సమయం గడిపేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
NEWS ALERT: Virat Kohli will miss the first T20I against Afghanistan in Mohali due to personal reasons pic.twitter.com/4D26Jse2LR
— CricTracker (@Cricketracker) January 10, 2024
భారత్ - అఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్
- తొలి టీ20 (జనవరి 11): ఐఎస్ బింద్రా స్టేడియం (మొహాలి)
- రెండో టీ20 (జనవరి 14): హోల్కర్ క్రికెట్ స్టేడియం (ఇండోర్)
- మూడో టీ20 (జనవరి 17): చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)