ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అతను బాగా కోలుకుంటున్నాడని చెప్తున్నప్పటికీ.. పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. దీంతో అతడు శనివారం ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్ కు దూరం కానున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి మినహా వరుస విజయాలతో జోరుమీదున్న ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ ఇది.
ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడింది. అనంతరం తదుపరి మ్యాచ్‌కు నాలుగు రోజుల విరామం రావడంతో ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గోల్ఫ్ ఆడుతుండగా మ్యాక్స్‌వెల్ గాయపడ్డారని సమాచారం. అతను గోల్ఫ్ కార్ట్ వాహనం వెనుక నుండి జారి పడడంతో తలకు గాయమైనట్లు తెలుస్తోంది.
JUST IN: Glenn Maxwell will miss Australia's match against England on Saturday after suffering a concussion in a golf-related incident #CWC23 pic.twitter.com/07ZqKGb0M4
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2023
కాగా, మ్యాక్స్‌వెల్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో 106 పరుగులు) బాదిన సంగతి తెలిసిందే.