IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడ్.. ముంబై ఇండియన్స్ చెంతకు పాండ్యా!

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడ్.. ముంబై ఇండియన్స్ చెంతకు పాండ్యా!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అన్నట్లు అంబానీ తలచుకుంటే కాని పనంటూ ఏదైనా ఉంటదా! చెప్పండి. డబ్బులు ఉన్నాయి.. ఎవరిని కావాలంటే వారిని కొనేస్తాడు.. ఐపీఎల్ 17వ ఎడిషన్‌ బదిలీలలో ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

నివేదికల ప్రకారం.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్నట్లు సమాచారం. ట్రేడ్ రూపంలో అతన్ని చేజిక్కించేకునేందుకు నీతా అంబానీకి చెందిన ముంబై యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందట. అందుకు బదులుగా ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ని ట్రేడ్ రూపంలో వదులుకోనుందని సమాచారం. ఇప్పటికే ఈ డీల్ ఓకే అయినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే నాటికి పాండ్యా తన మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ, ముంబై ఇండియన్స్ చెంతకు చేరతాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్

2022 ఐపీఎల్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ పాండ్యా కోసం రూ.15 కోట్లు వెచ్చించగా.. జోఫ్రా ఆర్చర్‌ కోసం ముంబై యాజమాన్యం రూ.8 కోట్లు వెచ్చించింది. ఇంత భారీ ధర పలికిన ఆటగాళ్లు ట్రేడ్ ద్వారా బదిలీ కావడమనేది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ డీల్ ఒకే అయితే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ కానుంది. ఫ్రాంచైజీలు పరస్పరం ట్రేడ్‌ చేసుకొన్నా వేలం ప్రకారమే వీరికి ఫీజులు చెల్లిస్తాయి.