క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 ఎడిషన్ సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి వేలాన్ని విదేశాల్లో నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. దుబాయ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ 18 లేదా 19న వేలం జరగనుందని నివేదికలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024, డబ్ల్యూపీఎల్ 2024.. ఏది ముందు..?
ఐపీఎల్ కన్నా ముందు మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం జరగనుందని కథనాలు వస్తున్నప్పటికీ.. వేదిక ఇంకా ఖరారు కాలేదు. అయితే డబ్ల్యూపీఎల్ వేలం భారత్‌లోనే నిర్వహించనున్నారట.
ALSO READ :- ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. మూవీలపై నెగెటివ్ రివ్యూలు.. తొమ్మిది మంది అరెస్ట్
ఈ వార్తలపై ఫాంచైజీలు నోరు మెదపడం లేదు. తమకు ఎలాంటి సమాచారం లేదని మీడియా ప్రతినిధులకు చెప్తున్నారు. అయితే వేలానికి ముందుగానే ఫ్రాంచైజీలన్నీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లతో పాటు వదిలేసే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ బోర్డుకు అందించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి త్వరలోనే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేయనుంది.
Major IPL 2024 updates. [Cricbuzz]
— Johns. (@CricCrazyJohns) October 26, 2023
- Dubai is likely to host the IPL auction.
- December 18 or 19 will be the auction date.
- Trade window is open. pic.twitter.com/VPhWTuErq1