ఓ వైపు యాపిల్ ప్రేమికులు.. ఐఫోన్ 15 కోసం ఎగబడుతుంటే, మరోవైపు యాపిల్ సప్లయర్ ఫ్యాక్టరీపై ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు, చెన్నైలోని యాపిల్ సప్లయర్ ఫ్యాక్టరీపై ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వార్తలొస్తున్నాయి.
Also Read :- డిసెంబరు వరకు నామినీని చేర్చేందుకు గడువు
బృందాలుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెన్నై యాపిల్ సప్లయర్ ఫ్యాక్టరీని సందర్శించారని ఓ జాతీయ ఛానల్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడుల ఉద్దేశ్యం ఏంటన్నది తెలియజేయాల్సింది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారా..! లేదంటే మనీ లాండరింగ్ వంటి లొసుగులు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.